గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 20:32:56

వినియోగదారుల హక్కులను కాపాడాలి : వినోద్‌ కుమార్‌

వినియోగదారుల హక్కులను కాపాడాలి : వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌ : వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిచోట వినియోగదారులు మోసాలకు గురవుతున్నారని అన్నారు. మోసాల బారి నుంచి వినియోగదారులకు కాపాడేందుకు 1986లో జాతీయస్థాయిలో చట్టాన్ని తీసుకువచ్చారని గుర్తుచేశారు.

ఈ చట్టానికి మరింత పదును పట్టి 2019 లో కొత్త వినియోగదారుల చట్టాన్ని అమలు చేశారని తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఫిబ్రవరిలో వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ప్రభుత్వ ప్రతినిధిగా తాను హాజరు కానున్నట్లు తెలిపారు. వినియోగదారుల హక్కుల కోసం కృషిచేస్తున్న సంఘ ప్రతినిధులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రజాకవి జయరాజ్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు అంబు రాథోడ్, ప్రధాన కార్యదర్శి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo