వినియోగదారుల హక్కులను కాపాడాలి

- ప్రభుత్వాలకు వారు చెల్లించే పన్నులే ఆధారం
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
కవాడిగూడ: వినియోగదారుడు చెల్లిస్తున్న పన్నులపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధారపడి ఉన్నాయని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉన్నదని స్పష్టంచేశారు. వినియోగదారుల హక్కులపై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని, తద్వారా ప్రజల్లో నమ్మకం ఏర్పడి వినియోగదారుల హక్కులపై అవగాహన వస్తుందని చెప్పారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో ‘కరోనా కష్టకాలంలో అలుపెరుగని సేవకులకు అభినందన’ సత్కార సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. వినియోగదారుల చట్టం అమలులోకి వచ్చిన కొత్తలోనే రాష్ట్రంలో వినియోగదారుల హక్కులపై ఓ కేసును తాను హైకోర్టులో గెలిచానని గుర్తుచేశారు. త్వరలో జిల్లాలవారీగా అధికారిక సమావేశాలు నిర్వహించి సమస్యలు, అవగాహన అంశాలపై సీఎం కేసీఆర్ వివరిస్తానన్నారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించేలా కృషిచేస్తానని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించిన పలువురు జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ట్రాన్స్జెండర్లను శాలువాలతో సత్కరించారు. సమావేశంలో తెలంగాణ వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అంబు రాథోడ్, ప్రధాన కార్యదర్శి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రిపబ్లికన్ నేత ట్విట్టర్ అకౌంట్ లాక్.. ఎందుకో తెలుసా ?
- బూర్గుల నర్సింగరావు మృతి.. కేటీఆర్ సంతాపం
- కమెడీయన్స్ గ్రూప్ ఫొటో.. వైరల్‌గా మారిన పిక్
- ఇక మీ ఇష్టం.. ఏ పార్టీలో అయినా చేరండి!
- వాఘాలో ఈ సారి బీటింగ్ రిట్రీట్ ఉండదు..
- గుంటూరు జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- ప్రత్యేక గుర్తింపుకోసమే అంగన్వాడీలకు యూనిఫాం
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత