గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:56:57

దసరా నుంచి కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం

దసరా నుంచి కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నూతన సమీకృత సచివాలయం నిర్మాణ పనులు దసరా నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడాదిలోగా సచివాలయం నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌ ఒడ్డులోని గ్రౌండ్‌ జీరోలో సాయిల్‌ టెస్టింగ్‌ కొనసాగుతున్నది. ఈనెల 15న టెండర్లు ఖరారు కానున్నాయి. టెండర్‌ సాధించిన కంపెనీ దసరా నుంచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. కొత్త సచివాలయానికి సంబంధించి అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయి. ఇటీవల ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో టెండర్ల అంశంపై జరిగిన సమావేశంలో ఈఎన్సీ గణపతిరెడ్డి బిల్డర్ల సందేహాలను నివృత్తి చేశారు.logo