మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 15:58:42

బీడు భూములు సస్యశ్యామలం : మంత్రి వేముల

బీడు భూములు సస్యశ్యామలం : మంత్రి వేముల

నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలో బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం కమ్మరపల్లిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన  ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. గతంలో  కమ్మరపల్లి వస్తుంటే గాండ్లపెట్ వద్ద బీడు భూముల్లో లారీలు నిలిపి కనిపించేవని కానీ ఇవాళ ఆ దుస్థితి లేదన్నారు.

ప్రభుత్వం ప్రణాళికాబద్ధం రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కరించేలా ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో  దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని, బీజేపీ నాయకులు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.