సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 16:21:08

'నాలుగు నెలల్లో బాలనగర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి'

'నాలుగు నెలల్లో బాలనగర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి'

హైదరాబాద్ : నవంబర్ నెల నాటికి బాలానగర్2 ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని పశుసంర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆయన బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నగరంలో అనేక చోట్ల ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ ల పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 68.67 కోట్ల రూపాయల వ్యయంతో 1.13 కిలోమీటర్ల 6 లైన్స్ గా బాలానగర్ ఫ్లై నిర్మాణ పనులు వేగవంతం గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా మధ్యలో కొద్ది రోజులు పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయితే వాహనదారుల ఇక్కట్లు తొలగిపోతాయన్నారు. మంత్రి వెంట డిప్యూటీ కమిషనర్ రవి కిరణ్, ప్రశాంతి, జీహెచ్ఎంసీ, సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ ప్రేమ్ జ్యోతి, ఈఈ హుస్సేన్,, డీఈ అప్పారావు తదితరులు ఉన్నారు.


logo