శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 19:00:18

అత్యున్నత ప్రమాణాలతో ఫార్మా సిటీ నిర్మాణం: మంత్రి కేటీఆర్‌

అత్యున్నత ప్రమాణాలతో ఫార్మా సిటీ నిర్మాణం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీ ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అత్యుత్తమ ప్రమాణాలతో ఫార్మా సిటీని నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఫార్మా సిటీ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, లైఫ్‌ సైన్సెన్స్‌, ఫార్మా డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... ఫార్మాసిటీ హైదరాబాద్‌ స్థానాన్ని భవిష్యత్‌లో మరింత బలోపేతం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్‌ ఫార్మా సిటీ రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఫార్మా సిటీ ప్రాధాన్యత, అవసరం పెరిగిందన్నారు. కరోనాకు తయారవుతున్న మందుతోపాటు వ్యాక్సిన్‌ కూడా ఇక్కడి నుంచే రాబోతోన్నట్లు తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగంలో హైదరాబాద్‌ ప్రాధాన్యతను ఫార్మా సిటీ ఎత్తి చూపుతుందని పేర్కొన్నారు.


logo