శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 17:08:32

అమరవీరల స్మారక స్థూపం నిర్మాణం పూర్తి : కలెక్టర్

అమరవీరల స్మారక స్థూపం నిర్మాణం పూర్తి : కలెక్టర్

కొత్తగూడెం : జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో రూ.20 లక్షల వ్యయంతో  చేపట్టిన అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణం పూర్తయ్యిందని కలెక్టర్ డాక్టర్‌ ఎంవీరెడ్డి తెలిపారు. త్వరలో స్థూపాన్ని ప్రారంభిస్తామని, ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, జడ్పీ చైర్మన్‌ను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల త్యాగ నిరతికి 

గుర్తుగా ప్రతి జిల్లాలో అమరుల ఏకరూప స్మారక స్థూప నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. త్యాగానికి, సాహసానికి ఇది చిహ్నమని చెప్పారు. స్థూపంశీర్షభాగంలో తెలుపు రంగు గుర్తులు ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి నిజాయితీకి, సాహసానికి సంకేతమని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.