మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 12:24:52

అధునాతన సౌకర్యాలతో రైతు వేదికల నిర్మాణం

అధునాతన సౌకర్యాలతో రైతు వేదికల నిర్మాణం

వికారాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్  రైతు పక్ష పాతిగా ఉంటూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం చించల్ పెట్ గ్రామంలో  రైతు వేదిక నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. 

అలాగే 22 లక్షల రూపాయల తో నిర్మించనున్న రైతు వేదిక పనుల తో పాటు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 520 కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా రైతు వేదికలు ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్సు హాల్ లాంటి అధునాతన సౌకర్యాలతో రైతు వేదికలు నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలు, అధికారులు రైతు వేదికల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. 


ఒక్క సీపీ కెమెరా వంద మంది పోలీస్ ల తో సమానం అన్నారు. చించల్ పెట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, జడ్పీటీసీ కాలె జయమ్మ , ఎంపీపీ కాలె భవాని రవికాంత్ , మొయినబాద్ జడ్పీటీసీ కాలే శ్రీకాంత్ , సర్పంచ్ కాలే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.logo