మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 15:51:28

దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి : మంత్రి జగదీష్ రెడ్డి

దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి : మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి :  దేవాలయాల్లా రైతు వేదికలు నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని పండగలా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి వ్యవసాయం దోహదపడుతుందన్నారు.

వ్యవసాయ అనుబంధ సంఘాలను బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ వ్యవసాయానికి ప్రత్యేక గుర్తిపుందని తెలిపారు. 5వేల ఎకరాలకు క్లస్టర్  ఏర్పాటు చేశామని, ప్రతి క్లస్టర్ కు రైతుకు వేదిక ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దసరా నాటికి రైతు వేదికలు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, శాసన మండలి విప్ కర్నె ప్రభాకర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఎంపీపీ తాండూరు వెంకట్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
logo