శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 15:35:12

రైతువేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలి

రైతువేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలి

వరంగల్ అర్బన్:  రైతువేదికల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయని  లేనిపక్షంలో అధికారుల పై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను హెచ్చరించారు. ఎంపీడీవోలు పంచాయతీ రాజ్ ఇంజినీర్లు ఏపీవోలు ఏంపీవోలతో రైతువేదికల నిర్మాణాల ప్రగతిపై సోమవారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెన్, మెటీరియల్ పెంచి రాత్రి, పగలు పని చేస్తేనే నిర్దేశించిన సమయంలో పూర్తి అవుతాయన్నారు.

రైతువేదికల నిర్మాణాలపై ముఖ్యమంత్రి  సీరియస్ గా ఉన్నారని అధికారులను హెచ్చరించారు. అధికారులు నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని జిల్లాల్లో రైతువేదికల నిర్మాణాల కోసం రాత్రి కూడా పని చేపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నా సరే అన్నింటిని దసరా నాటికి పూర్తి చేయలని ఆదేశించారు. ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే తెలియ జేయాలన్నారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేసే అవకాశం ఉంటుందన్నారు. 

పనుల ప్రగతిని బట్టి ఎప్పటి కప్పుడూ ఏజెన్సీకి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ఇకపై వారం వారం పనుల ప్రగతి పై ఫొటోలు అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల్లో ఇసుక ఎంతెంత అవసరం ఉంటుందో  సాయంత్రంలోగా వివరాలను అందజేయాలన్నారు.


logo