మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 16:55:19

రైతు వేదికల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలి

రైతు వేదికల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలి

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 70 రైతు వేదికలు ఉండగా దాదాపుగ అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయని, ఆగస్టు 15 లోగా అన్ని వేదికల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. అదే విధంగా జిల్లాలో ఈ వర్షాకాలం సాగుచేస్తున్న పంటలపై ప్రస్తుతం సర్వే జరుగుతోందని, ఈ సర్వే 75 శాతం పూర్తయిందని తెలిపారు.

 రేపటిలోగా పంటల సర్వే పూర్తి చేసి ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఏ పీడీ శైలేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ వెంకట్రావు తదితరులు ఉన్నారు.logo