సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 18:04:39

అక్టోబర్ 11 నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

అక్టోబర్ 11 నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

పెద్దపల్లి  :  ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు అక్టోబర్ 11 నాటికి రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని పెద్దపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో  స్థానిక జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గుర్తించిన భూమిలో రైతు వేదిక నిర్మాణానికి సంబంధించి మంత్రి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. 

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు తగిన సమయంలో రైతు వేదిక నిర్మాణం పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.   దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అన్నారు.  రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచామని, ప్రతి ఎకరాకు రూ 5 వేల చోప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్నది తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు.

రైతులు సంఘటితంగా సమావేశాలు నిర్వహించుకునేందుకు వారి సమస్యలు వ్యవసాయం తదితర అంశాలను చర్చించుకునే ఎందుకు రైతు వేదికలను నిర్మిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు  పాల్గొన్నారు.


logo