మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 12:19:34

రైతు వేదికల నిర్మాణాలు..ప్రగతికి సోపానాలు : మంత్రి పువ్వాడ

రైతు వేదికల నిర్మాణాలు..ప్రగతికి సోపానాలు : మంత్రి పువ్వాడ

 ఖమ్మం : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంన్నది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ వారికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 7వ డివిజన్ అల్లిపురం దంసలాపురం పరిధిలోని రైతు వేదిక నిర్మాణ  పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు వేదికల ద్వారా కర్షకులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రైతు బీమా వల్ల అనేక రైతు కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ రైతులకు అనుకూలమైన చర్యలు చేపడుతూ వారు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు పాటు పడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ , మేయర్ పాపాలాల్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, రైతు బంధు జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, అధికారులు, కార్పొరేటర్లు, రైతులు ఉన్నారు.




logo