గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 15:21:14

రైతు సమస్యల పరిష్కారానికే.. రైతు వేదికల నిర్మాణం

రైతు సమస్యల పరిష్కారానికే.. రైతు వేదికల నిర్మాణం

మహబూబాబాద్ : రైతులు బాగుండాలి, వ్యవసాయం పండగ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్  రైతు కోసం రైతు వేదికల నిర్మాణం చేపట్టారని గిరిజన , స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గుండ్రాతి మడుగులో  రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్ర మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో శంకుస్థాపన చేసుకుంటున్న ఈ రైతు వేదిక ప్రారంభం నాటికి కరోనా పూర్తిగా తగ్గాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. కరోనా విజృంభిస్తోందని అందరూ జాగ్రత్తగా ఉండి క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. 

టీఆర్ఎస్  ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. నిత్యం రైతుల సంక్షేమం గురించే సీఎం ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, జడ్పీటీసీ బండ వెంకట్ రెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.


logo