గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 16:50:40

సాగుపై చర్చించేందుకే రైతు వేదికల నిర్మాణాలు

సాగుపై చర్చించేందుకే రైతు వేదికల నిర్మాణాలు

మహబూబాబాద్  :  రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్  అనేక విధాలుగా కృషి చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామం, ఉప్పరపల్లి గ్రామం మరియు ఇనుగుర్తి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. రైతులు సాగుపై చర్చించేందుకే రైతు వేదికలు నిర్మిస్తున్నామన్నారు. అలాగే హరిత హారం కార్యక్రమంలో భాగంగా పెనుగొండ గ్రామంలో మొక్కలు నాటారు. కరోన వైరస్ విస్తరిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ తో పాటు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు.


logo