శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 13:26:01

దసరాలోగా రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

దసరాలోగా రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

అదిలాబాద్ : జిల్లాలో నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణం దసరా లోపు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మంగళవారం ఉట్నూర్ మండలం షాంపూర్, నర్సాపూర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 105 వేదికల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గడువులోగా రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. రైతువేదికల నిర్మాణాలతో రైతులు తమ సమస్యలను చర్చించి పరిష్కరించేకునే అవకాశం ఉంటుందని తెలిపారు.