శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 12, 2020 , 02:19:27

పంద్రాగస్టు నాటికి రైతువేదికలు

పంద్రాగస్టు నాటికి రైతువేదికలు

    • అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
    • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

    నర్సాపూర్‌/మనోహరాబాద్‌/హత్నూర: పంద్రాగస్టు నాటికి రైతువేదికలు సిద్ధంకావాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివా రం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, శివ్వంపేట, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్‌మద్దూర్‌లో పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులను పరిశీలించారు. స్వచ్ఛతలో చీక్‌మద్దూర్‌ ఆదర్శంగా నిలిచిందని, ఆదర్శ మండలంగా శివ్వంపేట జాతీయ అవార్డు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నేడు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని అన్నారు. పట్టణాలను తలదన్నేలా పల్లెలను తయారు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఒక్కప్పుడు బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్లేవారని, ప్రస్తుతం ఆహ్లాదకర, ఆరోగ్యకర జీవనంకోసం పల్లెలకు వస్తున్నారన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సంగారెడ్డి జిల్లాలో 647, మెదక్‌ జిల్లాలో 469 గ్రామపంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తి చేయడంపట్ల సంతోషం వ్యక్తంచేశారు. నర్సాపూర్‌ ఆర్టీసీ బస్‌డిపో వద్దకు వెళ్లి పనులను పరిశీలించి, పనుల ఆలస్యంపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాసాల గ్రామశివారులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులు వేగవంతంగా జరుగడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయా కార్యక్రమాల్లో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, అధికారులు, నాయకులున్నారు.     logo