శనివారం 04 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 15:28:18

చెక్ డ్యాంల నిర్మాణంతో..పెరుగనున్న భూగర్భ జలాలు

చెక్ డ్యాంల నిర్మాణంతో..పెరుగనున్న భూగర్భ జలాలు

వికారాబాద్:  భూగర్భ జలాల పెంపునకుకు చెక్ డ్యాంలు దోహదం చేస్తాయని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. జిల్లాలోని తాండూరు మండలంలోని ఎల్మకన్య గ్రామంలో ఎనిమిది కోట్ల పై చిలుకు నిధులతో నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్  పట్నం సునీతా మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇండ్ల ముందు ఇంకుడు గుంతల నుంచి మొదలు కొని కాలువలు, నదులు, వాగులు, వంకల నుంచి పారె వర్షపు నీటిని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మంచి నీరు అందించిన వాళ్లమవుతామన్నారు. వర్షపు నీరు వృథా కాకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో రూ.72 కోట్లతో చెక్ డ్యాంలు నిర్మిస్తున్నామిన తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు. 


logo