గురువారం 09 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 22:46:31

అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి

అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి

హైదరాబాద్‌ : అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు.  మహిళా శిశు సంక్షేమశాఖలో పెండింగ్‌ పనులపై దామోదర్‌ సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఆ శాఖ కమిషనర్‌, ప్రత్యేక కార్యదర్శి దివ్యతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా-శిశు సంక్షేమశాఖలో దాదాపు 12వేల అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ఉపాధి హామీ నిధులు వినియోగించి వీటికి శాశ్వత భవనాలు నిర్మించాలని సూచించారు. కిరాయి భవనాల్లో నడుస్తున్న  అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని పాఠశాలల్లో నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.  ఆరోగ్యలక్ష్మి కింద గర్భిణులకు మందులు సకాలంలో అందేలా చూడాలని, నవజాత శిశువులకు టీకాలు క్రమం తప్పకుండా వేసేలా పర్యవేక్షించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని, గ్రామాల్లో కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.logo