మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 13:38:31

భవన నిర్మాణ కార్మికుల‌కు ఇబ్బంది రాకూడ‌దు : కేటీఆర్‌

భవన నిర్మాణ కార్మికుల‌కు ఇబ్బంది రాకూడ‌దు : కేటీఆర్‌

రాష్ట్రంలోని వివిధ నిర్మాణ ప్రాజెక్టుల్లో పని చేసే భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఇబ్బందుల్ని రానీయ‌కుండా పూర్తి స్థాయి జాగ్రత్తల్ని తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గురువారం ఉద‌యం తెలంగాణ నిర్మాణ సంఘాలు క్యాంపు కార్యాల‌యంలో మంత్రి కేటీఆర్ని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ నిర్మాణ ప్రాజెక్టుల్లో నివ‌సించే కార్మికుల‌కు ఎలాంటి కొరత రాకుండా చూడాల‌ని, వీరు నివసించే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచేందుకు డెవలపర్లు పక్కాగా వ్యవహరించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్క నిర్మాణ సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోర‌గా నిర్మాణ సంఘాల‌న్నీ అంగీక‌రించాయ‌ని తెలిసింది. ఇప్పటికే తమ సైట్లలో భవన నిర్మాణ కార్మికులకు ఎలాంటి కొరత రానీయకుండా తగు చర్యల్ని తీసుకుంటున్నామని మంత్రికి నిర్మాణ సంఘాలు వివ‌రించిన‌ట్లు స‌మాచారం. మంత్రిని కలిసినవారిలో క్రెడాయ్ హైదరాబాద్, క్రెడాయ్ తెలంగాణ, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్,  తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డెవలపర్స్ అసోయేషన్ అధ్యక్షుడు జీవీ రావు మాట్లాడుతూ.. తమ సభ్యులు నిర్మించే ప్రాజెక్టుల్లో అన్నిరకాల జాగ్రత్తల్ని తీసుకుంటామని వివరించారు.logo
>>>>>>