గురువారం 28 మే 2020
Telangana - May 21, 2020 , 23:05:17

కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో విధులు..కానిస్టేబుల్‌కు సన్మానం

కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో విధులు..కానిస్టేబుల్‌కు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న వెంకట్‌రెడ్డి కొవిడ్‌-19 బందోబస్తులో భాగంగా హైదరాబాద్‌లో 40 రోజుల పాటు ప్రత్యేక విధులను నిర్వర్తించారు.

గాంధీ దవాఖాన, కంటైయిన్‌ మెంట్‌ జోన్‌లో విధులను ముగించుకుని వెంకట్‌రెడ్డి ఎల్లారెడ్డిపేట పీఎస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డిని తోటి మిత్రులు, సిబ్బంది సాదరంగా ఆహ్వానించి, శాలువాతో సన్మానించారు. వెంకట్ రెడ్డి సేవలను ప్రశంసిస్తూ..ఆయనకు జ్ఞాపికను అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo