గురువారం 02 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 23:28:24

భార్యను హత్య చేసిన కానిస్టేబుల్‌

భార్యను హత్య చేసిన కానిస్టేబుల్‌

వరంగల్‌ అర్బన్‌: జిల్లాలోని మామునూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పింఛన్‌పూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎండీ ఆయుబ్‌ఖాన్‌(40) పీసీ నెంబర్‌ 60, 2000 బెటాలియన్‌ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ తన భార్య తస్లీమా సుల్తానాను గొంతు నులిమి హత్య చేశాడు. రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్యూటీ నిర్వహిస్తున్న ఇతడు ఈ రోజు విధులకు హాజరు కాలేదు. డ్యూటీకి ఎందుకు రాలేదని ఆరా తీయగా ఈ ఘటన వెలుగు చూసింది. శవం వద్దనే కూర్చుని ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 


logo