ఆదివారం 31 మే 2020
Telangana - May 06, 2020 , 21:36:09

సీజ్‌ చేసిన మద్యం ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్‌

సీజ్‌ చేసిన మద్యం ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్‌

కరీంనగర్‌: లాక్‌డౌన్‌ సమయంలో సీజ్‌ చేసిన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన పోలీస్‌ కానిస్టేబుల్‌ను కరీంనగర్‌ పోలీసులు పట్టుకొన్నారు. సదరు కానిస్టేబుల్‌ కరీంనగర్‌లోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల పోలీసులు విద్యానగర్‌ ప్రాంతంలో ఒక వ్యక్తి నుంచి 69 మద్యం బాటిళ్లను పట్టుకొని సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వాటిని కోర్టు విధులు చూసే కానిస్టేబుల్‌కు అప్పగించి, కోర్టు విధులు మొదలైన తర్వాత ఇవ్వమన్నారు. 

తాళంచెవితో కాకుండా స్ట్రాంగ్‌రూం తలుపులను స్కూలు ఇప్పదీసి ఇదే పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి సాయంతో సీజ్‌ చేసిన మద్యం సీసాలను సదరు కానిస్టేబుల్‌ ఎత్తుకెళ్లాడు. ఇవన్నీ పీఎస్‌లో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. విషయం తన దృష్టికి రావడంతో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి.. సీసీఎస్‌ పోలీసులతో విచారణ జరిపించి వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయించాడు. 


logo