సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 13:10:52

హాస్పిట‌ల్ విధుల్లో ఉన్న‌ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

హాస్పిట‌ల్ విధుల్లో ఉన్న‌ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

హైదరాబాద్: గాంధీ హాస్పిట‌ల్‌లో విధినిర్వహ‌ణ‌లో ఉన్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందారు. 2014 బ్యాచ్‌కు చెందిన అంపోలు క్రాంతి కుమార్ హైద‌రాబాద్‌లోని బోయిన్‌‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నారు. విధుల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు గాంధీ ద‌వాఖాన‌లో రిపోర్టు చేశారు. రాత్రి స‌మ‌యంలో ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో హుటాహుటిన నిమ్స్ ద‌వాఖాన‌కు త‌రలించారు. అయితే అప్ప‌టికే కానిస్టేబుల్ మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు బోయిన్‌ప‌ల్లి పోలీసులు తెలిపారు.   


logo