e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కుట్ర

నల్లగొండ: తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు, అలజడి సృష్టించే పన్నాగాలు ఇక్కడ సాగవని, ఇలాంటి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. కులాల పేరుతో రెచ్చగొట్టేవారికి ప్రజలు బుద్ధిచెప్పాలని అన్నారు. మండలి చైర్మన్‌ ఇవాళ నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణను అస్థిరపరిచే శక్తులకు రాష్ట్రంలో స్థానంలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుతున్నదని చెప్పారు.

ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ఆంధ్రాపాలనలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని చెప్పారు. ఇంకా దుర్బుద్ధితో దోచుకునేందుకు కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీ చేసిందెవరని ప్రశ్నించారు. గడీల పాలన తెలంగాణలో లేదని.. పులివెందులలోనే ఉందని వైఎస్‌ షర్మిలను ఉద్దేశించి అన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?
టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్‌ పొందండి
హోంలోన్ భారం వేగంగా క్లియ‌ర్ కావాలంటే..!
పుష్ప‌పై కాపీ ఆరోప‌ణ‌లు..!
రాహుల్ ద్ర‌విడ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో
హాట్ హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న జాన్వీ క‌పూర్
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana