శుక్రవారం 29 మే 2020
Telangana - Mar 31, 2020 , 23:55:32

హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర

హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర

-ఢిల్లీ తరహా గొడవలకు ప్లాన్‌

-ఇద్దరి అరెస్టు   

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నిన ఇద్దరు యువకులను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. అదనపు డీసీపీ చక్రవర్తిగుమ్మి తెలిపిన వివరాల ప్రకారం.. రియాసత్‌నగర్‌కు చెందిన హర్షద్‌, బాబానగర్‌కు చెందిన అబ్దుల్‌ వసీ చిన్ననాటి స్నేహితులు. ఢిల్లీలో ఇటీవలి అల్లర్ల వీడియోలను చూసి ఇక్కడ కూడా గొడవలు సృష్టించాలని ప్లాన్‌చేశారు. మాదన్నపేట్‌ ప్రాంతంలో ఇటీవల ఓ వర్గానికి చెందిన ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసకర చర్యలకు ప్రయత్నించారు. అంతకుముందు కంచన్‌బాగ్‌ఠాణా పరిధిలో బస్సుకు నిప్పంటించేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా ఈ చర్యలకు పాల్పడింది హర్షద్‌, అబ్దుల్‌వాసీ అని తేలింది. ఈ ఇద్దరిని  అరెస్టు చేశారు. మాదన్నపేట్‌, కంచన్‌బాగ్‌ ఘటనలతోపాటు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏటీఎంను కూడా ధ్వంసంచేసినట్టు నిందితులు విచారణలో ఒప్పుకొన్నారు. 


logo