గురువారం 02 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:21:07

రైతు వేదికలతో కర్షకులు సంఘటితం

రైతు వేదికలతో కర్షకులు సంఘటితం

  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రైతులందరిని సంఘటితం చేసి గిట్టుబాటు ధర, పంట విధివిదానాలపై చర్చించుకునేలా సీఎం కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తన సొంత ఖర్చులతో చేపడుతున్న రైతుబంధు వేదిక పనులను బుధవారం  మంత్రి పర్యవేక్షించారు. ఆయనవెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.logo