మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 02:24:49

కేంద్ర చట్టాలతో భయాందోళన

కేంద్ర చట్టాలతో భయాందోళన
  • శాసనమండలిలో బీజేపీ మినహా సభ్యుల ఏకాభిప్రాయం
  • సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేలా ఉన్నాయని శాసనమండలి ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీకి వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించింది. సోమవారం మధ్యాహ్న భోజన విరామం అనంతరం సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీపై సీఎం కేసీఆర్‌ తరఫున శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానం ఉద్దేశం, లక్ష్యాలను మంత్రి వివరించారు. ఆ తర్వాత జరిగిన చర్చలో బీజేపీ పక్షనేత రామచంద్రారావు, ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఫారూక్‌హుస్సేన్‌, కాంగ్రెస్‌ సభ్యుడు టీ జీవన్‌రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఫరీదుద్దీన్‌ పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఏఏ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని, అందుకే ఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని చెప్పారు.


logo
>>>>>>