శనివారం 04 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 12:52:14

హరితహారంతో ప్రజల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం

హరితహారంతో ప్రజల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం

సూర్యాపేట : మొక్కల పెంపకం ప్రాధాన్యతను గుర్తించిం రాష్ట్రాన్ని హరితమయంగా చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే హరితహారం పేరుతో గడిచిన ఆరు ఏండ్లుగా చైతన్యం తీసుకొచ్చి మొక్కల పెంపకంలో పోటీపడేలా చేసిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా గురువారం ఉదయం ఆయన సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని 9 వ వార్డులో ఏకకాలంలో 1050 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమస్య ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపథ్యంలో అడవుల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సత్ఫాలితాలు సాదించిందన్నారు. పర్యావరణ సమస్యను అధిగమించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.logo