శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 21:08:21

మానసిక స్థైర్యంతోనే కరోనాను జయించా : ఎమ్మెల్యే గొంగిడి సునీత

మానసిక స్థైర్యంతోనే కరోనాను జయించా : ఎమ్మెల్యే గొంగిడి సునీత

హైదరాబాద్‌ : దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలుంటేనే కచ్చితంగా కరోనా అని నిర్ధారించడం సరికాదని, కరోనా సోకినా కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైరస్‌ బారినపడి కోలుకున్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ తెలిపారు. కరోనా బారినపడి కోలుకున్న ఆమె తన అనుభవాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. తనకు స్వల్ప తలనొప్పి, ఒంటినొప్పులుండడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ.. మానసికంగా ధైర్యంతో ఉంటూ వారంరోజుల్లోనే కోలుకున్నానని తెలిపారు. ఎంత కష్టం వచ్చినా మానసిక స్థైర్యం ముఖ్యమని చెప్పారు.

 


logo