ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:09:23

పాటల పోలీస్‌.. శిక్షణలో భేష్‌

పాటల పోలీస్‌.. శిక్షణలో భేష్‌

  • పాటలు పాడుతూ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్న ఏఆర్‌ఎస్సై రఫీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పోలీస్‌ ట్రైనింగ్‌ అంటే మాటలు కాదు.. ట్రైనింగ్‌ ఇచ్చే ట్రైనర్లు కఠినంగా వ్యవహరిస్తారు. కొందరు ట్రైనైర్లెతే చండశాసనుల్లా వ్యవహరిస్తారు. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లా టీఎస్‌ఎస్పీ పదో బెటాలియన్‌ ఏఆర్‌ఎస్సై మహ్మద్‌ రఫీ ఇచ్చే శిక్షణ ప్రత్యేకం. ఆయన శిక్షణలోపాటలుంటాయి. పాటల్లో జోష్‌ ఉంటుంది. ఆ జోష్‌లో లెఫ్ట్‌, రైట్‌ అంటూ కిలోమీటర్ల దూరం ఈజీగా వెళ్లిరావొచ్చు. 1970ల్లో వచ్చిన  హమ్‌జోలి సినిమాలోని ‘ధల్‌గయా దిన్‌ హో గ యా శామ్‌.. జానేదో జానా హై.. అభీఅభీతో ఆయీ హో.. అభీఅభీ జానాహై’అంటూ సాగే పాటను మార్చ్‌పాస్ట్‌కు అన్వయించారు. ఈ పాట పాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ ఆర్మ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ ట్రైనీలను ఉత్సాహపరుస్తున్నారు. ‘ఖూన్‌భి దేంగే..జాన్‌భి దేంగే..దేశ్‌కి మిట్టీ కభీ న దేంగే’అంటూ దేశభక్తిని నూరిపోస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.


logo