బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 00:04:53

అభివృద్ధికి అడ్డుపడటమే కాంగ్రెస్‌ పని

అభివృద్ధికి అడ్డుపడటమే కాంగ్రెస్‌ పని

  • ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ విమర్శ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాం గ్రెస్‌ పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. రాష్ర్టాభివృద్ధిని ఆ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రతిపనినీ అడ్డుకుంటూ లిటిగేషన్ల పార్టీగా మారిందని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఉస్మానియా దవాఖాన, సచివాలయం ఇలా అన్నింటిపై కేసులు వేసి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. కాళేశ్వరంపై ఎన్ని కేసులు వేసినా కోర్టులో నిలువలేదన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధర్మంవైపు నిలబడినందునే కోర్టుల్లో అనుకూల తీర్పులు వస్తున్నాయని, కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికైనా కండ్లు తెరువాలని హితవుపలికారు.  


logo