మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:58

కొంపముంచిన జలదీక్ష

కొంపముంచిన జలదీక్ష

  • కాంగ్రెస్‌ నాయకుల తీరుతో భద్రాద్రి జిల్లాలో కలకలం 

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన జలదీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులకు శిక్షలా మారింది. ఆ సమయంలో సదరు నేతలెవరూ మాస్కులు ధరించకపోవడంతో వారితో కాంటాక్టయిన పలువురికి కరోనా వైరస్‌ సోకింది. ఈ నెల 12న హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుంమంతరావు, ఎమ్మెల్సీ రాములునాయక్‌, ఇతర నేతలు భద్రాచలం చేరుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనతో కాంటక్టయిన తొమ్మిది మందికి కరోనా సోకింది. 


logo