బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 11:35:53

కాంగ్రెస్‌ పార్టీ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్‌ పార్టీ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: కరోనా బారినపడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్‌) ఆ జాబితాలో చేరారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబానికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. 

వీహెచ్‌ కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కాంగ్రెస్‌ పార్టీలో టెన్షన్‌ నెలకొంది. ఆ పార్టీ ఇటీవల నిర్వహించిన జలదీక్షలో ఆయన పాల్గొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని వంద మందికి చెద్దర్లు పంపిణీ చేశారు. అదేరోజు ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు వీహెచ్‌ కాంటాక్టులను గుర్తించే పనిలోపడ్డారు.


logo