బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 02:15:04

డ్రోన్‌ కేసులో రేవంత్‌ అరెస్ట్‌

డ్రోన్‌ కేసులో రేవంత్‌ అరెస్ట్‌
  • 14రోజుల రిమాండ్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు

హైదరాబాద్‌ సిటీబ్యూరో/మణికొండ, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మియాఖాన్‌గూడలోని ఓ ప్రైవేట్‌ ఫాంహౌజ్‌పైకి డ్రోన్‌ కెమెరా పంపి రహస్యంగా చిత్రీకరించిన కేసులో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డిని నార్సింగి పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఈ కేసులో బుధవారం ప్రవీణ్‌పాల్‌రెడ్డి, విజయసింహారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజేశ్‌, శివ, ఓంప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని విచారించగా.. డ్రోన్‌ కెమెరాతో రహస్యంగా ఫాంహౌజ్‌లోని దృశ్యాలను చిత్రీకరించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి, అతని సోదరుడు కృష్ణారెడ్డి పథకం పన్నినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు.


రేవంత్‌రెడ్డి వితండవాదం

గురువారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి.. నేరుగా నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై కేసు ఎలా పెడతారంటూ పోలీసులతో వాదనకు దిగారు. నిబంధనలను తుంగలో తొక్కి కుట్రపూరితంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రోన్‌ కెమెరాను వినియోగించారని నిర్ధారించే ఆధారాలను అతని ముందుపెట్టినా నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌తో వాగ్వాదం కొనసాగించారు. దీంతో పోలీసులు రేవంత్‌ను అరెస్టుచేసి.. నలందనగర్‌లోని జడ్జి సంతోష్‌కుమార్‌ నివాసంలో హాజరుపర్చారు. జడ్జి.. రేవంత్‌కు ఈ నెల 18వ తేదీవరకు రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు ఎంపీని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో రేవంత్‌ సోదరుడు కృష్ణారెడ్డి, విజయ్‌పాల్‌రెడ్డిని అరెస్టు చేయాల్సి ఉన్నది.


logo
>>>>>>