శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 14:24:17

శాసనసభ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌

శాసనసభ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌

హైదరాబాద్‌ : శాసనసభ నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఒక రోజు పాటు కాంగ్రెస్‌ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌ అయిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జయప్రకాశ్‌ రెడ్డి, పోడెం వీరయ్య, అనసూయ, భట్టి విక్రమార్క ఉన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు.


logo