మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 16:58:14

ప్రాజెక్టులపై అవగాహన లేని కాంగ్రెస్‌ నేతలు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రాజెక్టులపై అవగాహన లేని కాంగ్రెస్‌ నేతలు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ పార్టీ నేతలకు అవగాహన లేదని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాయలసీమ పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెల వ్యవధిలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. రాయలసీమ, పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిందన్నారు. మిగులు జలాల్లో కింది రాష్ర్టాలకు హక్కు ఉంటుందని, తెలంగాణకు కూడా మిగులు జలాలు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ పంపింది. కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వం జీవోలు ఇస్తూ అంచనాలు రూపొందిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే ఊరుకోమని పేర్కొన్నారు.


logo