సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 16:41:25

జగిత్యాలలో కారెక్కిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాలలో కారెక్కిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల : టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని వెల్గటూర్ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ టీపీపీసీ సభ్యుడు, చుక్క శంకర్ రావు, మండలంలోని జగదేవ్ పేట, రాంనూర్ గ్రామాల నుంచి వారి అనుచర వర్గం.. 300 మంది కాంగ్రెస్ ను వీడి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. 


logo