కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్‌లో రాదు: మంత్రి హరీశ్

సంగారెడ్డి: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా మారాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణకు వాహనాలు, ప్రకృతి వనాలు, ప్రతి నెలా పల్లె ప్రగతి కింద నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సదాశివపేటలో పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. ఆపార్టీ అధికారంలో లేదని.. భవిషత్లో వచ్చే అవకాశం కూడా లేదన్నారు. ఈ ప్రాంతంలో గత 70 ఏండ్లలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనలో జరుగుతున్నదని తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందని వెల్లడించారు. ఈ మార్పులను చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి అధికార పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. సదాశివపేటలో రూ.32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలకు పట్టణ ప్రగతి కింద ప్రతీ నెలా నిధులను ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. సదాశివపేట బస్టాండ్ అభివృద్ధికి ఇటీవలే రూ.20 లక్షలు విడుదల చేశామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు.
అంతకుముందు జిల్లాలోని కందిలో ఓ ప్రైవేట్ దవాఖానలో క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని ప్రారంభించారు. కార్పొరేట్ వైద్యం ప్రజలకు అందేలా ఉండాలన్నారు. ఈ దిశగానే తమ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తాలూకా స్థాయి వరకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్‌కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్‌కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు