శనివారం 04 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 14:10:42

వారి జల దీక్షలు దొంగ నాటకాలే: ఎర్రబెల్లి

వారి జల దీక్షలు దొంగ నాటకాలే: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: జలదీక్షల పేరుతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు దొంగనాటకాలు ఆడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వాలు నిర్మించిన, పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, దేవాదులను పూర్తి చేసింది సీఎం కేసీఆర్‌ ప్రభుత్వమేనని వెల్లడించారు. వారు అభివృద్ధి చేయరు, మరొకరిని చేయనీయరని విమర్శించారు.

రాష్ట్రంలో కోటి ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే, వాటివద్ద ఆ పార్టీలవారు ఆందోళనలు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. అయినా ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ఆ పార్టీలను ప్రజలు విస్మరించారని చెప్పారు.


logo