బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 17:57:17

తైక్వాండో క్రీడాకారిణికి అభినందనలు

తైక్వాండో క్రీడాకారిణికి అభినందనలు

హైదరాబాద్‌ : అంతర్జాతీయ తైక్వాండో పోటీలో సత్తా చాటిన నిజామాబాద్‌ జిల్లా క్రీడాకారిణిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు నిర్వహించిన పీఎం కప్పు ఆన్లైన్ ఓపెన్ అంతర్జాతీయ తైక్వాండో పోటీలో నందిపేట మండలం తొండకురు గ్రామానికి చెందిన మద్దుల శ్రీనిక గోల్డ్ మెడల్ సాధించినట్లు కోచ్ బి.హిరాలల్ సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీకి వివరించారు.  అండర్- 11 సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన శ్రీనికను ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో జిల్లాకు అనేక పథకాలు తీసుకురావాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో జాతీయ విలువిద్య క్రీడాకారుడు మద్దుల మురళి, తదితరులు పాల్గొన్నారు.ఇవి కూడా చదవండి..

తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు : మంత్రి పువ్వాడ

వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు : మంత్రి వేముల

సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్సీ కవిత 


logo