అంకురాలకు ఊతం

- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు
- నలుగురు స్టార్టప్ వ్యవస్థాపకులకు అభినందనలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ యువత నూతన ఆలోచనలతో స్టార్టప్స్‌ను నెలకొల్పి తొలి ప్రయత్నంలోనే విజయాలు సాధించడం అభినందనీయమని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అంకుర పరిశ్రమలకు తెలంగాణ ఊతమిస్తున్నదని చెప్పారు. స్టార్టప్‌లను స్థాపించి ఫలితాలు సాధిస్తున్న నలుగురు యువకులు బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వరంగల్‌కు చెందిన అరుణ్‌కుమార్ రాపోలు ఇంజినీరింగ్ పూర్తయ్యాక కొన్నాళ్లు యానిమేషన్, గేమింగ్ కంపెనీల్లో పనిచేశారు. తర్వాత తానే ఏ-థీరం అనే యానిమేషన్ అంకుర పరిశ్రమను స్థాపించాడు. దేశంలోనే తొలి మోషన్ క్యా ప్చర్ సినిమా ధీరను రూపొందించారు. పూర్తిగా తెలంగాణలో రూపొందించిన ఈ సినిమా ఈ నెలలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై 12 భాషల్లో విశేష ఆదరణ పొందుతున్నది. మంత్రి కేటీఆర్‌ను కలిసిన అరుణ్‌కుమార్.. తెలంగాణ రాష్ట్రంలో అంకుర పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుపై కృతజ్ఞతలు తెలిపారు. టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసి మరే రాష్ట్రంలో లేనివిధంగా స్టార్టప్ ఎకో సిస్టమ్ తెలంగాణలో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన మోషన్ క్యాప్చర్ సినిమా తీసి సక్సెస్ సాధించిన అరుణ్‌కుమార్‌ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు. వివిధ భారతీయ భాషల్లో డిజిటల్ పబ్లిషింగ్ ఫ్లాట్‌ఫారం కహానియా వ్యవస్థాపకుడు పల్లవ్ బజ్జురి, నానో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎక్స్‌ప్రెస్ ఫౌండర్ శ్రీనివాస్ మాధవం, డిజిటల్ క్యాంపస్ ఫ్లాట్‌ఫారం స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు కూడా మం త్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ లక్కరాజు రచించిన డాడ్ అనే పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.
తాజావార్తలు
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం
- ‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ డన్.. లాభాలు ఆన్