శభాష్ కోనప్ప..సీఎం కేసీఆర్ అభినందన

కుమ్రంభీం ఆసిఫాబాద్ : నిత్యం ప్రజాసేవలో తలమునకలై ఉండే ఆ ఎమ్మెల్యే ప్రజాసేవలో సైతం ముందుంటూ పలువురి మన్ననలను పొందుతున్నాడు. ఈ మేరకు సదరు ప్రజాప్రతినిధి సేవలను సీఎం ప్రశంసించారు.కోనేరు చారిటబుల్ ట్రస్టు ద్వారా జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కోనప్ప కుటుంబ సభ్యులు బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకున్నారు. నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
ప్రతి రోజు 1000 మందికి అన్నదానం చేయడం, స్కూళ్లకు టీవీలు అందచేయడం, టీచర్ – పోలీస్, మిలటరీ, ఫారెస్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, రక్తహీనత ఉన్న మహిళలకు పోషకాహారం అందించడం, ఎస్సీ, ఎస్టీలకు సామూహిక వివాహాలు జరిపించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని సీఎం అభినందించారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
- చైనా ఉపసంహరిస్తేనే.. మన దళాలను తగ్గిస్తాం : రాజ్నాథ్
- నెటిజన్స్ ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసిన సమంత
- నిలకడగా శశికళ ఆరోగ్యం
- ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్