శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Mar 01, 2020 , 01:15:56

ఉద్యోగినులకు ఒకపూట విరామం

ఉద్యోగినులకు ఒకపూట విరామం
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెసులుబాటు
  • చర్చలు, సదస్సులు, ఆటల పోటీల్లో పాల్గొనేవారికి అవకాశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించే ఆటల పోటీలు, సదస్సులు, చర్చల్లో పాల్గొనేందుకు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ఒక పూట అనుమతినిచ్చింది. శనివారం ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అందులో పాల్గొనేవారికి కార్యాలయాల్లోని విధుల నుంచి ఒకపూట మినహాయింపు ఇవ్వాలని టీఎన్జీవో సెంట్రల్‌ యూనియన్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆయా రోజుల్లో వాస్తవంగా క్రీడలు, సదస్సులు, చర్చల్లో పాల్గొనే మహిళా ఉద్యోగులకు ఒక పూట అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది.


logo