మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 15:29:19

అక్రమ పట్టా చేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

అక్రమ పట్టా చేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

జయశంకర్ భూపాలపల్లి : రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని తప్పుడు పట్టా చేశారని ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. జిల్లాలోని భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి వెంకులు కుటుంబం పురుగుల మందు డబ్బా పట్టుకొని భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తన రెండో కుమారుడు ఓదేలుకు చెందిన భూమిని తహసీల్దార్, వీఆర్వో డబ్బులు తీసుకొని అక్రమంగా తన పెద్ద కొడుకు పేరు మీద పట్టా చేశారని ఆరోపించారు. న్యాయం చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు.logo