సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 23, 2020 , 15:35:01

జీహెచ్‌ఎంసీకి సమగ్ర చట్టం : సీఎం కేసీఆర్‌

జీహెచ్‌ఎంసీకి సమగ్ర చట్టం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాబోయే కొద్ది రోజులు జీహెచ్‌ఎంసీకి సమగ్రమైన చట్టం తీసుకువస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పూర్తిస్థాయిలో అద్భుతంగా, అన్ని రకాల పారదర్శకంగా ఉండేలా, అవనీతి రహితంగా ఉండేలా సమగ్రమైన చట్టం తేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తీసుకువచ్చిన టీఎస్‌ బీపాస్‌, నూతన రెవెన్యూ చట్టం వంటి పదునైన చట్టాలను తెచ్చామని,  క్రమంలోనే నగర అభివృద్ధికి ఊతమిచ్చేలా కొత్త చట్టంలో నిబంధనలు పొందుపరుస్తామన్నారు. ధరణిపై చాలా మందికి అనేక అనుమానాలుండేవని.. టీఆర్‌ఎస్‌ తీసుకువచ్చి కార్యక్రమాలన్నీ యావత్‌ దేశమే ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు. మిషన్‌ భగరీథ, 24గంటల కరెంటు, సాగునీటి రంగంపై ఎవరికీ నమ్మకం లేదని.. వాటిన్నంటినీ అమలు చేసి చూపామన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా సాధించనంత వేగంగా.. అనితర సాధ్యంగా, అనన్యసామాన్యంగా వాటన్నింటినీ నిజాలు చేసి ప్రజల అనుభవంలోకి టీఆర్‌ఎస్‌ తీసుకువచ్చిందన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.