గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 19:18:16

ఖమ్మం పట్టణాభివృద్ధికి సమగ్ర కృషి : మంత్రి పువ్వాడ

ఖమ్మం పట్టణాభివృద్ధికి సమగ్ర కృషి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ లో రూ.20 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.  Cఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా మరిన్ని రోడ్లు విస్తరించి సెంట్రల్ లైటింగ్, డివైడర్ లు ఏర్పాటు చేస్తామన్నారు. దీర్ఘకాలికంగా అనేక రోడ్లు విస్తరణకు నోచుకోలేదని ప్రజా అవసరాలకు అనుగుణంగా అన్ని రోడ్లు అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణ సమగ్రాభివృద్ధికి పాటుపడుతామన్నారు.


కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిమీషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు, కమర్తపు మురళి, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ, డివిజన్ నాయకులు రుద్రాగని ఉపేందర్, తోట వీరభద్రం ఉన్నారు. అలాగే కార్పొరేషన్ లోని 38వ డివిజన్లలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ ముఖ ద్వారం(Arch)ను ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ దిమ్మెను ప్రారంభించి పార్టీ జెండాను ఎగురవేశారు. logo