సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 14:37:59

జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు పూర్తి : మంత్రి సత్యవతి రాథోడ్

జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు పూర్తి  : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్  : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో సోమవారం(06.07.2020)  సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత సుప్రీం కోర్టు ప్రారంభం అయిన మొదటి రోజునే ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై గిరిజనుల హక్కులు, ప్రయోజనాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, అంకితభావానికి నిదర్శనమని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను వంద శాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన జీవో 3ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కరోనా లాక్ డౌన్ సమయంలో కొట్టివేయడం తెలిసిందే. ఈ జీవోను కొట్టివేసిన వెంటనే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ సుప్రీం కోర్టు నుంచి ఈ తీర్పు కాపీలు తెప్పించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నిపుల సలహా మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేశామన్నారు.

బీజేపీ నేతలకు రాష్ట్ర గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆమోదింపచేయాలన్నారు. రిజర్వేషన్లను10 శాతానికి పెంపు, జీవో 3 పునరుద్ధరించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి, గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. logo