e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home Top Slides మున్సిపల్‌శాఖలో 95% వ్యాక్సినేషన్‌

మున్సిపల్‌శాఖలో 95% వ్యాక్సినేషన్‌

మున్సిపల్‌శాఖలో 95% వ్యాక్సినేషన్‌
  • ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు పూర్తయిన టీకాలు
  • త్వరలోనే 100 శాతానికి.. ట్విట్టర్‌లో కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరులో అత్యంత కీలకంగా పనిచేస్తున్న మున్సిపల్‌ శాఖ.. వ్యాక్సినేషన్‌లోనూ ఆదర్శంగా నిలిచింది. ఆ శాఖలో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు 95 శాతం మంది వ్యాక్సిన్‌ వేసుకొన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర్‌ ద్వారా పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు. 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 95.55శాతం మంది, జీహెచ్‌ఎంసీ పరిధిలో 96.19 శాతం మంది వాక్సిన్‌ వేసుకొన్నారని తెలిపారు. త్వరలోనే వందకు వంద శాతం వాక్సిన్‌ వేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఆనారోగ్యంతో కొందరు వ్యాక్సిన్‌ వేసుకోలేదని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30,269 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు వాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకోగా, 28,922 మంది వ్యాక్సిన్‌ వేసుకొన్నారు. మరో 1,347 మంది వాక్సిన్‌ వేసుకోవాల్సి ఉంది. అటు.. కరోనా విజృభింస్తున్నందున పారిశుధ్య పనుల నిమిత్తం మున్సిపల్‌ ఉద్యోగులు, అధికారులకు సెలవులు రద్దు చేస్తూ సీడీఎంఏ సత్యానారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులు మినహా మిగిలిన వారేవ్వరికి కూడా సెలవులు ఇవ్వవద్దని ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు.

వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసినవి..
ధర్మపురి, ఐజా, గద్వాల, ఎల్లారెడ్డి, కరీంనగర్‌, సత్తుపల్లి, మరిపెడ, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, మంచిర్యాల, నస్పూర్‌, రామాయంపేట, బోడుప్పల్‌, దుండిగల్‌, గుండ్లపోచంపల్లి, పోచారం, నిజాంపేట, దమ్మాయిగూడ, మేడ్చల్‌, నారాయణ్‌పేట్‌, కొస్గి, మక్తల్‌, బైంసా, ఖానాపూర్‌, నిర్మల్‌, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ, ఆదిభట్ల, మీర్‌పేట్‌, ఇబ్రహీంపట్నం, అమీన్‌పూర్‌, నారాయణ్‌ఖేడ్‌, గజ్వేల్‌, నేరేడుచర్ల, వరంగల్‌, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, మోత్కురు, ఆత్మకూరు, వనపర్తి.

ఇవీ కూడా చదవండి…

ప్రగతి పరుగులకు ఓటేయండి

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం : ఆర్డీఓ

ధర్మపురి ఆలయ విస్తరణకు చర్యలు

Advertisement
మున్సిపల్‌శాఖలో 95% వ్యాక్సినేషన్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement