శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 18:31:10

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి : మంత్రి ఎర్రబెల్లి

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, కొడకండ్ల గ్రామంలో డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నవంబర్ 4న సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నందున పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో వాళ్లకు ఇవి మోడల్‌గా నిలిచేలా సర్వాంగ సుందరంగా పనులు చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ఈ పనులను పూర్తి చేసే బాధ్యతలను తీసుకోవాలని సూచించారు.